గెలుపు
చిమ్మ చీకటిలో చంద్రుని వెలుగులా
మండిపోతున్న ఎండల్లో చల్లని పిల్ల గాలి లా
కుంభిస్తున్న వర్షం లో వేడి వేడి బజ్జీల్లా
బాధలో ఉన్న హృదయానికి తీయని సంగీతం లా
ఓటమి కౌగిట్లో చిక్కుకున్న నా మనసున చిన్న ఆశ.
ఆ ఆశే నన్ను ప్రతి అడుగు నడిపిస్తుంది
నా శ్వాసై నను ప్రతి అడుగు నడిపిస్తుంది
ప్రతి ఓటమి నాకో పాఠమవ్వాలి
ఆ పాఠమే నా గెలుపుకు త్రోవ చూపాలి .
ప్రయత్నమనే కొవ్వత్తి కి
ఇస్తేనే పట్టుదల అనే అగ్గిపుల్ల తో నిప్పు
వెలువడుతుంది వెలుగు
దాని పేరే గెలుపు .
నాకు తెలుసు ఇవి నోటితో పలకడానికి
కవితగా రాయడానికి చాలా సులభంగా ఉంటాయని
ఆచరణే కష్టమని
కానీ నా జీవితం అను చీకటి లోకి
గెలుపు అనే వెలుగును తీసుకురావడానికి
దేనికైనా సిద్ధమే
నా పట్టుదలకు ఆ గెలుపే కైవసమవ్వాలి
నా జీవితాన్ని వెలుగుతో జ్వలింపచేయాలి.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి