ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

Spoorthy's character

స్ఫూర్తి అన్న పేరుకు జనరల్ గా  ఉన్న ఇమేజ్ డీసెంట్ ఇనొసెంట్ క్యూట్ అండ్ కామ్ కానీ నీ అసలు ఇమేజ్ కి మాత్రం వాళ్ళూహించలేరు మొదలు తుదలు లేచిన దగ్గర్నుంచీ మొదలు అల్లరి ఆటలు గెలుక్కునే చేతలు చీటికీ మాటకీ "అమ్మా!" నాదాలు ఆ తరువాత "ఊరికేనే!" సమాధానాలు మూడొస్తే చాలు అమ్మదగ్గర ముద్దులు అలకొస్తే చాలు అందరితో గుద్దులు ఇంటిల్లిపాది కలిసి అరిచే పాటలు చెల్లెలితో పాటు మధ్య మధ్యలో గెంతులు ఫొనోస్తే చాలు ఏ బుక్కో చూడకుండా గీతలు లావై పోతున్నానంటూ మధ్య మధ్య లో complaint లు చిన్న సంతోషానికే విరజాజులు వికసించే చిరునవ్వులు చిన్న దు:ఖానికే వెలుగింట్లో కరెంటు పోయిన లుక్కు చిన్న కోపానికే మందారంలా ఎరుపెక్కె ముక్కు చిన్న జగడానికే ఆకాశమంత అలక  వెనకడుగు అనే పదాన్ని మరచి introvert మనస్తత్వాన్ని విడచి సవాళ్లపై సవాళ్ళు గెలిచి చెలరేగి దూసుకుపోతున్నావు చీల్చి  కొత్తగా కళ కనిపించిందా కంటికి నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది మనసుగంటగంటకీ నిండా పట్టించుకోవాలంటావు దాన్ని నీ వంటికీ నైపుణ్యం సాధించేదాకా నిద్ర పట్టదు ఆ కంటికి   మాటలు వరదలా పారినా పాటలు గల గలా పొంగినా ఆటలు ఆగడాలు ఓ ఊపు ఊపిన ఆది నీ

Yedhi Yedhi

ఏది ఏది అనే పాటకు సాహిత్యం  మార్చి మా అమ్మ పుట్టినరోజుకు బహుకరించాను . అదే ఈ పాట .......  చిత్రం :  ఎటో వెళ్ళిపోయింది మనసు  పల్లవి : ఏది ఏది దాచేది ఏది నీతో  ఏది ఏది తీర్చంది ఏది మాకై  నవ్వేస్తూ నవ్విస్తూ అపుడపుడు కసిరేస్తూ  నువ్వే మా లోకం అయినావే  చరణం : నువ్వేగా అమ్మ నాలోని ప్రాణం చాలా కాలంగా  నీతోనే కాదా నా ప్రతి సంతోషం ఇంకా అందంగా  నీ మాటే లాలీ పాటయ్యి లాలించదా నన్నిలాగా  నాతోనే నువ్విక ఉంటె  నా గెలుపే తథ్యంగ  నీ తలపే నిత్యంగా  నేనిలా నీ సర్వస్వం ఐనాగా                                                                                 ॥ ఏది ఏది ॥  చరణం :   నీ తోడే నాకు నా బాట చూపె  చాలా స్పష్టంగా  నీ నవ్వే నాకు వెన్నెలలందించే  చాలా అందంగా  నీకంటూ లేదే ఏ ఆశ  మా మీదే నీ ధ్యాస  అనురాగం పంచేటి నీ చూపుతో  బాధల్నే మరిపించి అందంగా మురిపించే  అమ్మే మా ప్రాణంగా 

Amma

నా పుట్టుకకు కారణం అమ్మ  నా కళ్ళకు అందం అమ్మ  నా వరకు తీపి స్నేహం అమ్మ  నే గెలిచే గెలుపు తనదే  నే పిలిచే పిలుపు తనదే  నేనున్న ఈ నిమిషం తనదే  నే రేచీకట్లలో చిక్కుకుపోయిన సమయంలో  వెన్నెలలా తొలగించే నా భయం సులువుగా  తనకు మించి నన్ను గూర్చి తర్కిస్తూ  నన్ను తనను మించేలా చేయాలని యత్నిస్తూ  నా మంచి మాత్రమె కోరే ఏకైక గురువు అమ్మ  నా ఓటమిని సైతం స్వీకరించి  నన్ను తిరిగి గెలుపు త్రోవ పట్టించి  నా కంటూ గుర్తింపు తెచ్చిన నా లోకం అమ్మ !

Amma

అమ్మా అన్న పిలుపుకే పులకరించదా మనసు! ఆమె పేరు కన్నా తీయనైనది కాదా ఆమె మనసు !! ఎప్పుడూ చిరునవ్వు అప్పుడప్పుడు అలక కొన్నిసార్లు బాధ  ఇంకొన్నిసార్లు క్రోధం కాని ఎలాగైనా నా కంటికి ఇంపైన రూపం అమ్మ ! జన్మ నుంచి చదువు వరకు చిలిపితనం నుంచి బాధ్యతల వరకు  అమ్మ నేర్పిందే ప్రతి పాఠం  ఆ తల్లి ప్రేమ తో మన జన్మ ధన్యం ! తను కనే ప్రతి కల లో  కలగలుపుకొంతుంది నిన్ను  నీ కాలనే తన కలగా మార్చుకుంటుంది తను  తానక్కడ ఉన్నా  మనసు నీ చుట్టే  ఎన్ని సమస్యలు ఉన్నా  ఆలోచన నీ గూర్చే! అలా నా ప్రతి అడుగులో  ప్రతి గెలుపుకు  ఊతనందించిన అమ్మకు  ఏమిచ్చుకోను క్రుతజ్ఞత తప్ప  ఎమివ్వగలను నా ప్రేమను తప్ప !