ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Chemistry

కెమిస్ట్రీ  Chemistry...... నా బుర్రకు ఇదో పెద్ద మిస్టరీ చూస్తేనే దానిలోని కాన్సెప్ట్స్   పోతుంది  నాలోని కాంఫిడెన్స్ ! నా బుర్ర దీన్నో వైరస్  లా ఫీలయ్యి ఎన్ని సార్లు కనెక్ట్ చేసిన accept చెయ్యట్లే     Unrecognised డిస్క్ అని వస్తుందే తప్ప   బుర్రలోకి ఒక్క కాన్సెప్ట్ కూడా కాపీ అవ్వట్లే.  దీని పుణ్యాన పోయాయి మార్క్స్    తీసుకున్నారు నాకు ఇంట్లో క్లాస్  దీని వల్ల పోయింది క్లాస్ లో నాపై ఇంప్రెషన్   అందుకే నాకు ఇదంటే టెన్షన్ .   ఒక Atom లో ఎమున్టాయో తెలుసుకుని నేనేం చెయ్యను ? ఒక Molecule ఎలా తయారవుతుందో నాకెందుకు ? నిజ జీవితం లో ఎక్కడని వాడను  ఈ సంగతుల్ని ?    " నువ్వు Carbon నేను Oxygen   మనది సులువుగా విడదీయని కాంబినేషన్ " అని ఏ అబ్బాయైన అమ్మాయితో అంటే     " మన Combination వల్ల అవుతుంది చాలా మందికి Suffocation   ఇలాంటి చెత్త కవితలు చెప్పి పుట్టించకు నాకు Irritation " అని రివర్స్ పంచ్ కొడితే అంతే !! దీని గురించి తెలుసుకుంటే ఎవరికేమోస్తుందో తెలీదు కాని  నాకు మాత్రం తలనొప్పొస్తుంది అది నా ఆరోగ్యాన

Gelupu

గెలుపు చిమ్మ చీకటిలో చంద్రుని వెలుగులా  మండిపోతున్న ఎండల్లో చల్లని పిల్ల గాలి లా  కుంభిస్తున్న వర్షం లో వేడి వేడి బజ్జీల్లా  బాధలో ఉన్న హృదయానికి  తీయని సంగీతం లా ఓటమి కౌగిట్లో చిక్కుకున్న నా మనసున  చిన్న ఆశ.  ఆ ఆశే నన్ను ప్రతి అడుగు నడిపిస్తుంది నా శ్వాసై నను ప్రతి అడుగు నడిపిస్తుంది  ప్రతి ఓటమి నాకో పాఠమవ్వాలి ఆ పాఠమే నా గెలుపుకు త్రోవ చూపాలి .  ప్రయత్నమనే కొవ్వత్తి కి  ఇస్తేనే పట్టుదల అనే అగ్గిపుల్ల తో నిప్పు  వెలువడుతుంది వెలుగు  దాని పేరే గెలుపు .  నాకు తెలుసు ఇవి నోటితో పలకడానికి  కవితగా రాయడానికి చాలా సులభంగా ఉంటాయని  ఆచరణే కష్టమని  కానీ నా జీవితం అను చీకటి లోకి  గెలుపు  అనే వెలుగును తీసుకురావడానికి  దేనికైనా సిద్ధమే  నా పట్టుదలకు ఆ గెలుపే కైవసమవ్వాలి   నా జీవితాన్ని వెలుగుతో జ్వలింపచేయాలి.  

KALA (Dream)

కల  ఎప్పుడూ  అనుకునే  నా  కల  కళ్ళముందు  కనిపిస్తుంది  నేడిలా  కానీ  కలగానే   కనిపించే  ఈ  కళ  ఎన్నడు  వరిస్తుందో  నన్నిలా   తలుచుకుంటే  ఆ  కల  పులకరిస్తుంది  ఒళ్లిలా  నిజమైతే  ఆ  కల  నా  సంతోషానికి  అవధులేల ?? ఇది నా కల  మరి  మీకూ  ఉందా  ఇలాంటి  ఓ  కల ? ఉంటె సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి  మీరు  నాలా !! :)  ;) :P