ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Haayi

 హాయి చల్లని చిరుగాలి చక్కిళ్ల ను కొంటెగా తడిమి  చక్కిలిగింతలు పెడుతుంటే    చీకటి తో కమ్ముకుపోయిన ఆకసంలోంచి  తొంగి చూస్తున్నచల్లని చంద్రుడి వెలుగులో గాలి తనని తాకినా ప్రతి సారి అలజడి రేపుతూ  ఊగుతున్న పచ్చని తరువుల మధ్య  ఇళయరాజా పాటలు మెల్లగా  అతి మధురంగా  వినిపిస్తూ చెవులకు విందులు చేస్తూ  ఆ రేయిని ఇంకా అందంగా అందిస్తుంటే  మనసుకు దగ్గరైన మనుషులతో మంతనాలేస్తూ  వేడి అన్నం, పప్పు, నెయ్యి తో విందు చేస్తుంటే  ఆహ ! ఆ హాయిని ఎవరు కాదంటారు ?