స్ఫూర్తి అన్న పేరుకు జనరల్ గా ఉన్న ఇమేజ్ డీసెంట్ ఇనొసెంట్ క్యూట్ అండ్ కామ్ కానీ నీ అసలు ఇమేజ్ కి మాత్రం వాళ్ళూహించలేరు మొదలు తుదలు లేచిన దగ్గర్నుంచీ మొదలు అల్లరి ఆటలు గెలుక్కునే చేతలు చీటికీ మాటకీ "అమ్మా!" నాదాలు ఆ తరువాత "ఊరికేనే!" సమాధానాలు మూడొస్తే చాలు అమ్మదగ్గర ముద్దులు అలకొస్తే చాలు అందరితో గుద్దులు ఇంటిల్లిపాది కలిసి అరిచే పాటలు చెల్లెలితో పాటు మధ్య మధ్యలో గెంతులు ఫొనోస్తే చాలు ఏ బుక్కో చూడకుండా గీతలు లావై పోతున్నానంటూ మధ్య మధ్య లో complaint లు చిన్న సంతోషానికే విరజాజులు వికసించే చిరునవ్వులు చిన్న దు:ఖానికే వెలుగింట్లో కరెంటు పోయిన లుక్కు చిన్న కోపానికే మందారంలా ఎరుపెక్కె ముక్కు చిన్న జగడానికే ఆకాశమంత అలక వెనకడుగు అనే పదాన్ని మరచి introvert మనస్తత్వాన్ని విడచి సవాళ్లపై సవాళ్ళు గెలిచి చెలరేగి దూసుకుపోతున్నావు చీల్చి కొత్తగా కళ కనిపించిందా కంటికి నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది మనసుగంటగంటకీ నిండా పట్టించుకోవాలంటావు దాన్ని నీ వంటికీ నైపుణ్యం సాధించేదాకా నిద్ర పట్టదు ఆ కంటికి మాటలు వరదలా పారినా పాటలు గల గలా పొంగినా ఆటలు ఆగడాలు ఓ ఊపు ఊప...
Naku kopam vachina santosham vachina badha vachina ukrosham vachina kavitaluga vaakyalu dorlutayi ... alanti konni kavyalu ivi ...!!