ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Yedhi Yedhi

ఏది ఏది అనే పాటకు సాహిత్యం  మార్చి మా అమ్మ పుట్టినరోజుకు బహుకరించాను . అదే ఈ పాట ....... 

చిత్రం :  ఎటో వెళ్ళిపోయింది మనసు 

పల్లవి :

ఏది ఏది దాచేది ఏది నీతో 
ఏది ఏది తీర్చంది ఏది మాకై 

నవ్వేస్తూ నవ్విస్తూ అపుడపుడు కసిరేస్తూ 
నువ్వే మా లోకం అయినావే 

చరణం :

నువ్వేగా అమ్మ నాలోని ప్రాణం చాలా కాలంగా 
నీతోనే కాదా నా ప్రతి సంతోషం ఇంకా అందంగా 

నీ మాటే లాలీ పాటయ్యి లాలించదా నన్నిలాగా 
నాతోనే నువ్విక ఉంటె 
నా గెలుపే తథ్యంగ 
నీ తలపే నిత్యంగా 
నేనిలా నీ సర్వస్వం ఐనాగా 

                                                                               ॥ ఏది ఏది ॥ 

చరణం :  

నీ తోడే నాకు నా బాట చూపె 
చాలా స్పష్టంగా 
నీ నవ్వే నాకు వెన్నెలలందించే 
చాలా అందంగా 
నీకంటూ లేదే ఏ ఆశ 
మా మీదే నీ ధ్యాస 
అనురాగం పంచేటి నీ చూపుతో 
బాధల్నే మరిపించి అందంగా మురిపించే 
అమ్మే మా ప్రాణంగా 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KALA (Dream)

కల  ఎప్పుడూ  అనుకునే  నా  కల  కళ్ళముందు  కనిపిస్తుంది  నేడిలా  కానీ  కలగానే   కనిపించే  ఈ  కళ  ఎన్నడు  వరిస్తుందో  నన్నిలా   తలుచుకుంటే  ఆ  కల  పులకరిస్తుంది  ఒళ్లిలా  నిజమైతే  ఆ  కల  నా  సంతోషానికి  అవధులేల ?? ఇది నా కల  మరి  మీకూ  ఉందా  ఇలాంటి  ఓ  కల ? ఉంటె సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి  మీరు  నాలా !! :)  ;) :P 

ఎదిగిన స్నేహం

ఎదిగిన స్నేహం  కొత్త పరిచయాలతో కొంగొత్త పరిమళాలు విరజిమ్ముతూ నీ ముందు నిలిచింది నీ B.Tech స్నేహం పరిణితి వచ్చాక ప్రతి మనిషిని తాకే సంద్రపు కెరటం అందుకే చాలా మంది జీవితాలలో ఈ సమయంలో జరిగే స్నేహం శాశ్వతం ఆలోచనలకు అక్షయపాత్ర ఈ వయసు అనేక కార్యాలకు ఉరకలు వేసే మనసు దానికి మంచి ఏదో చెడు ఏదో తెలుసు అయినా తప్పటడుగులు వేయమని మనసు ఎగసు ఇలాంటి సమయం లోనే అవసరం రా నేస్తం నీకు మంచిచెడల వ్యత్యాసం తెలియజెప్పే తేజం నీ మనసు తెలుసుకుని నడుచుకునే తత్త్వం నీ క్షేమం కోసమే ఆరాటపడతాడు నిత్యం నీ తప్పులను వాటి వెనక చెప్పుడు ఆలోచనలను గ్రహించి నిన్ను నిన్ను గా స్వీకరించే సత్యం అటువంటి స్నేహం దొరకడం ఎడారి లో ఒయాసిస్ దొరకడమే కాని దొరికితే మాత్రం నీ జీవితం వెనుదిరగని విజయ యాత్ర నే !!           

Chemistry

కెమిస్ట్రీ  Chemistry...... నా బుర్రకు ఇదో పెద్ద మిస్టరీ చూస్తేనే దానిలోని కాన్సెప్ట్స్   పోతుంది  నాలోని కాంఫిడెన్స్ ! నా బుర్ర దీన్నో వైరస్  లా ఫీలయ్యి ఎన్ని సార్లు కనెక్ట్ చేసిన accept చెయ్యట్లే     Unrecognised డిస్క్ అని వస్తుందే తప్ప   బుర్రలోకి ఒక్క కాన్సెప్ట్ కూడా కాపీ అవ్వట్లే.  దీని పుణ్యాన పోయాయి మార్క్స్    తీసుకున్నారు నాకు ఇంట్లో క్లాస్  దీని వల్ల పోయింది క్లాస్ లో నాపై ఇంప్రెషన్   అందుకే నాకు ఇదంటే టెన్షన్ .   ఒక Atom లో ఎమున్టాయో తెలుసుకుని నేనేం చెయ్యను ? ఒక Molecule ఎలా తయారవుతుందో నాకెందుకు ? నిజ జీవితం లో ఎక్కడని వాడను  ఈ సంగతుల్ని ?    " నువ్వు Carbon నేను Oxygen   మనది సులువుగా విడదీయని కాంబినేషన్ " అని ఏ అబ్బాయైన అమ్మాయితో అంటే     " మన Combination వల్ల అవుతుంది చాలా మందికి Suffocation   ఇలాంటి చెత్త కవితలు చెప్పి పుట్టించకు నాకు Irritation " అని రివర్స్ పంచ్ కొడితే అంతే !! దీని గురించి ...