ఎదిగిన స్నేహం కొత్త పరిచయాలతో కొంగొత్త పరిమళాలు విరజిమ్ముతూ నీ ముందు నిలిచింది నీ B.Tech స్నేహం పరిణితి వచ్చాక ప్రతి మనిషిని తాకే సంద్రపు కెరటం అందుకే చాలా మంది జీవితాలలో ఈ సమయంలో జరిగే స్నేహం శాశ్వతం ఆలోచనలకు అక్షయపాత్ర ఈ వయసు అనేక కార్యాలకు ఉరకలు వేసే మనసు దానికి మంచి ఏదో చెడు ఏదో తెలుసు అయినా తప్పటడుగులు వేయమని మనసు ఎగసు ఇలాంటి సమయం లోనే అవసరం రా నేస్తం నీకు మంచిచెడల వ్యత్యాసం తెలియజెప్పే తేజం నీ మనసు తెలుసుకుని నడుచుకునే తత్త్వం నీ క్షేమం కోసమే ఆరాటపడతాడు నిత్యం నీ తప్పులను వాటి వెనక చెప్పుడు ఆలోచనలను గ్రహించి నిన్ను నిన్ను గా స్వీకరించే సత్యం అటువంటి స్నేహం దొరకడం ఎడారి లో ఒయాసిస్ దొరకడమే కాని దొరికితే మాత్రం నీ జీవితం వెనుదిరగని విజయ యాత్ర నే !!
Kya baat!! Good one shresta...
రిప్లయితొలగించండిThank You !!
తొలగించండి