ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎదిగిన స్నేహం

ఎదిగిన స్నేహం కొత్త పరిచయాలతో కొంగొత్త పరిమళాలు విరజిమ్ముతూ

నీ ముందు నిలిచింది నీ B.Tech స్నేహం

పరిణితి వచ్చాక ప్రతి మనిషిని తాకే సంద్రపు కెరటం

అందుకే చాలా మంది జీవితాలలో ఈ సమయంలో జరిగే స్నేహం శాశ్వతం

ఆలోచనలకు అక్షయపాత్ర ఈ వయసు

అనేక కార్యాలకు ఉరకలు వేసే మనసు

దానికి మంచి ఏదో చెడు ఏదో తెలుసు

అయినా తప్పటడుగులు వేయమని మనసు ఎగసు

ఇలాంటి సమయం లోనే అవసరం రా నేస్తం

నీకు మంచిచెడల వ్యత్యాసం తెలియజెప్పే తేజం

నీ మనసు తెలుసుకుని నడుచుకునే తత్త్వం

నీ క్షేమం కోసమే ఆరాటపడతాడు నిత్యం

నీ తప్పులను వాటి వెనక చెప్పుడు ఆలోచనలను గ్రహించి

నిన్ను నిన్ను గా స్వీకరించే సత్యం

అటువంటి స్నేహం దొరకడం

ఎడారి లో ఒయాసిస్ దొరకడమే

కాని దొరికితే మాత్రం నీ జీవితం

వెనుదిరగని విజయ యాత్ర నే !!          

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KALA (Dream)

కల 
ఎప్పుడూ  అనుకునే  నా  కల 
కళ్ళముందు  కనిపిస్తుంది  నేడిలా 
కానీ  కలగానే   కనిపించే  ఈ  కళ 
ఎన్నడు  వరిస్తుందో  నన్నిలా  
తలుచుకుంటే  ఆ  కల 
పులకరిస్తుంది  ఒళ్లిలా 
నిజమైతే  ఆ  కల 
నా  సంతోషానికి  అవధులేల ??
ఇది నా కల 
మరి  మీకూ  ఉందా  ఇలాంటి  ఓ  కల ?
ఉంటె సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి 
మీరు  నాలా !!
:)  ;) :P 

Spoorthy's character

స్ఫూర్తి అన్న పేరుకు జనరల్ గా  ఉన్న ఇమేజ్
డీసెంట్ ఇనొసెంట్ క్యూట్ అండ్ కామ్
కానీ నీ అసలు ఇమేజ్ కి మాత్రం
వాళ్ళూహించలేరు మొదలు తుదలు
లేచిన దగ్గర్నుంచీ మొదలు
అల్లరి ఆటలు గెలుక్కునే చేతలు
చీటికీ మాటకీ "అమ్మా!" నాదాలు
ఆ తరువాత "ఊరికేనే!" సమాధానాలు
మూడొస్తే చాలు అమ్మదగ్గర ముద్దులు
అలకొస్తే చాలు అందరితో గుద్దులు
ఇంటిల్లిపాది కలిసి అరిచే పాటలు
చెల్లెలితో పాటు మధ్య మధ్యలో గెంతులు
ఫొనోస్తే చాలు ఏ బుక్కో చూడకుండా గీతలు
లావై పోతున్నానంటూ మధ్య మధ్య లో complaint లు

చిన్న సంతోషానికే విరజాజులు వికసించే చిరునవ్వులు
చిన్న దు:ఖానికే వెలుగింట్లో కరెంటు పోయిన లుక్కు
చిన్న కోపానికే మందారంలా ఎరుపెక్కె ముక్కు
చిన్న జగడానికే ఆకాశమంత అలక 
వెనకడుగు అనే పదాన్ని మరచి
introvert మనస్తత్వాన్ని విడచి
సవాళ్లపై సవాళ్ళు గెలిచి
చెలరేగి దూసుకుపోతున్నావు చీల్చి 
కొత్తగా కళ కనిపించిందా కంటికి
నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది మనసుగంటగంటకీ
నిండా పట్టించుకోవాలంటావు దాన్ని నీ వంటికీ
నైపుణ్యం సాధించేదాకా నిద్ర పట్టదు ఆ కంటికి  
మాటలు వరదలా పారినా
పాటలు గల గలా పొంగినా
ఆటలు ఆగడాలు ఓ ఊపు ఊపిన
ఆది నీవె నని తెలుసు 
నువ్వు throw ball వేసావా
అ…