ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Yedhi Yedhi

ఏది ఏది అనే పాటకు సాహిత్యం  మార్చి మా అమ్మ పుట్టినరోజుకు బహుకరించాను . అదే ఈ పాట ....... 

చిత్రం :  ఎటో వెళ్ళిపోయింది మనసు 

పల్లవి :

ఏది ఏది దాచేది ఏది నీతో 
ఏది ఏది తీర్చంది ఏది మాకై 

నవ్వేస్తూ నవ్విస్తూ అపుడపుడు కసిరేస్తూ 
నువ్వే మా లోకం అయినావే 

చరణం :

నువ్వేగా అమ్మ నాలోని ప్రాణం చాలా కాలంగా 
నీతోనే కాదా నా ప్రతి సంతోషం ఇంకా అందంగా 

నీ మాటే లాలీ పాటయ్యి లాలించదా నన్నిలాగా 
నాతోనే నువ్విక ఉంటె 
నా గెలుపే తథ్యంగ 
నీ తలపే నిత్యంగా 
నేనిలా నీ సర్వస్వం ఐనాగా 

                                                                               ॥ ఏది ఏది ॥ 

చరణం :  

నీ తోడే నాకు నా బాట చూపె 
చాలా స్పష్టంగా 
నీ నవ్వే నాకు వెన్నెలలందించే 
చాలా అందంగా 
నీకంటూ లేదే ఏ ఆశ 
మా మీదే నీ ధ్యాస 
అనురాగం పంచేటి నీ చూపుతో 
బాధల్నే మరిపించి అందంగా మురిపించే 
అమ్మే మా ప్రాణంగా 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి