ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Haayi

 హాయి

చల్లని చిరుగాలి చక్కిళ్ల ను కొంటెగా తడిమి 
చక్కిలిగింతలు పెడుతుంటే  
చీకటి తో కమ్ముకుపోయిన ఆకసంలోంచి 
తొంగి చూస్తున్నచల్లని చంద్రుడి వెలుగులో
గాలి తనని తాకినా ప్రతి సారి అలజడి రేపుతూ 
ఊగుతున్న పచ్చని తరువుల మధ్య 
ఇళయరాజా పాటలు మెల్లగా అతి మధురంగా 
వినిపిస్తూ చెవులకు విందులు చేస్తూ 
ఆ రేయిని ఇంకా అందంగా అందిస్తుంటే 
మనసుకు దగ్గరైన మనుషులతో మంతనాలేస్తూ 
వేడి అన్నం, పప్పు, నెయ్యి తో విందు చేస్తుంటే 
ఆహ ! ఆ హాయిని ఎవరు కాదంటారు ? 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spoorthy's character

స్ఫూర్తి అన్న పేరుకు జనరల్ గా  ఉన్న ఇమేజ్ డీసెంట్ ఇనొసెంట్ క్యూట్ అండ్ కామ్ కానీ నీ అసలు ఇమేజ్ కి మాత్రం వాళ్ళూహించలేరు మొదలు తుదలు లేచిన దగ్గర్నుంచీ మొదలు అల్లరి ఆటలు గెలుక్కునే చేతలు చీటికీ మాటకీ "అమ్మా!" నాదాలు ఆ తరువాత "ఊరికేనే!" సమాధానాలు మూడొస్తే చాలు అమ్మదగ్గర ముద్దులు అలకొస్తే చాలు అందరితో గుద్దులు ఇంటిల్లిపాది కలిసి అరిచే పాటలు చెల్లెలితో పాటు మధ్య మధ్యలో గెంతులు ఫొనోస్తే చాలు ఏ బుక్కో చూడకుండా గీతలు లావై పోతున్నానంటూ మధ్య మధ్య లో complaint లు చిన్న సంతోషానికే విరజాజులు వికసించే చిరునవ్వులు చిన్న దు:ఖానికే వెలుగింట్లో కరెంటు పోయిన లుక్కు చిన్న కోపానికే మందారంలా ఎరుపెక్కె ముక్కు చిన్న జగడానికే ఆకాశమంత అలక  వెనకడుగు అనే పదాన్ని మరచి introvert మనస్తత్వాన్ని విడచి సవాళ్లపై సవాళ్ళు గెలిచి చెలరేగి దూసుకుపోతున్నావు చీల్చి  కొత్తగా కళ కనిపించిందా కంటికి నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది మనసుగంటగంటకీ నిండా పట్టించుకోవాలంటావు దాన్ని నీ వంటికీ నైపుణ్యం సాధించేదాకా నిద్ర పట్టదు ఆ కంటికి   మాటలు వరదలా పారినా పాటలు గల గలా పొంగినా ఆటలు ఆగడాలు ఓ ఊపు ఊప...

Yedhi Yedhi

ఏది ఏది అనే పాటకు సాహిత్యం  మార్చి మా అమ్మ పుట్టినరోజుకు బహుకరించాను . అదే ఈ పాట .......  చిత్రం :  ఎటో వెళ్ళిపోయింది మనసు  పల్లవి : ఏది ఏది దాచేది ఏది నీతో  ఏది ఏది తీర్చంది ఏది మాకై  నవ్వేస్తూ నవ్విస్తూ అపుడపుడు కసిరేస్తూ  నువ్వే మా లోకం అయినావే  చరణం : నువ్వేగా అమ్మ నాలోని ప్రాణం చాలా కాలంగా  నీతోనే కాదా నా ప్రతి సంతోషం ఇంకా అందంగా  నీ మాటే లాలీ పాటయ్యి లాలించదా నన్నిలాగా  నాతోనే నువ్విక ఉంటె  నా గెలుపే తథ్యంగ  నీ తలపే నిత్యంగా  నేనిలా నీ సర్వస్వం ఐనాగా                                                                                 ॥ ఏది ఏది ॥  చరణం :   నీ తోడే నాకు నా బాట చూపె  చాలా స్పష్టంగా  నీ నవ్వే నాకు వెన్నెలలందించే  చాలా ...

KALA (Dream)

కల  ఎప్పుడూ  అనుకునే  నా  కల  కళ్ళముందు  కనిపిస్తుంది  నేడిలా  కానీ  కలగానే   కనిపించే  ఈ  కళ  ఎన్నడు  వరిస్తుందో  నన్నిలా   తలుచుకుంటే  ఆ  కల  పులకరిస్తుంది  ఒళ్లిలా  నిజమైతే  ఆ  కల  నా  సంతోషానికి  అవధులేల ?? ఇది నా కల  మరి  మీకూ  ఉందా  ఇలాంటి  ఓ  కల ? ఉంటె సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి  మీరు  నాలా !! :)  ;) :P